Menu
Tirumala Annaprasadam Details

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నిత్యం పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ నైవేద్యాలతో పాటు అన్న ప్రసాదం కూడా సమర్పిస్తారు. ఈ అన్నప్రసాదం ద్వారా భక్తులకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ వారు. ప్రతి రోజు లక్షల్లో భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. 

టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ని 1985 లో ప్రారంభించారు. రోజుకి 2000 మంది భక్తులతో మొదలైన ఈ ట్రస్ట్ ఇవాళ వేలల్లో, లక్షల్లో భక్తులకు అన్నప్రసాదం సమర్పిస్తోంది. 

శ్రీనివాసుని భక్తురాలు అయిన తారిగొండ వెంగమాంబ ఈ అన్నదానానికి కొన్ని శతాబ్దాల క్రితం మార్గదర్శకం వహించారు. భక్తులకు ఆవిడ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుని అన్నదాన సేవ చేసారు. టీటీడీ వారు దాన్ని స్ఫూర్తి గా తీసుకుని ఈ అన్నదాన ట్రస్ట్ ను ప్రారంభించారు. 

ఈ నిత్యాన్నదానం హాల్ ఆది వరాహ స్వామి ఆలయం దగ్గర, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 300 మీటర్ల సమీపంలో ఉంది. 

అన్నప్రసాదం మెనూ 

అన్నప్రసాదం మెనూ లో ప్రతి రోజు  బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ ని ఏర్పాటు చేస్తారు. 

బ్రేక్ ఫాస్ట్ మెనూ లో ఉప్మా, పొంగల్, సేమియా ఉప్మా, సాంబార్, చట్నీ వంటి ఐటమ్స్ ని సర్వ్ చేస్తారు.  లంచ్ మరియు డిన్నర్ మెనూ లో రైస్, కర్రీ, సాంబార్, రసం, స్వీట్ పొంగలి, మజ్జిగ వంటి ఐటమ్స్ ని సర్వ్ చేస్తారు. 

అన్న ప్రసాదం కౌంటర్లు 

ఈ అన్నప్రసాదం సర్వ్ చేయడానికి టీటీడీ వారు తిరుపతి, తిరుచానూరు  మరియు తిరుమల లో అన్న ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. 
 
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కౌంటర్ లో 55 వేల నుంచి 65 వేల మంది భక్తులు అన్నప్రసాదం తీసుకుంటారు , వైకుంఠం క్యూ కాంప్లెక్స్ I & II కౌంటర్ 40 వేల నుంచి 45 వేల మంది భక్తులు ప్రసాదం తీసుకుంటారు,  ప్రత్యేక పండగల రోజుల్లో బయట ఉన్న క్యూ లైన్లు లో వేచి ఉన్న సుమారు 20 వేల భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు మరియు  PAC -II అన్నప్రసాదం కౌంటర్ లో 8 వేల నుంచి 10 వేల మంది భక్తులకు ప్రసాదం అందిస్తున్నారు. 

తిరుపతి లో టీటీడీ వారి  శ్రీనివాసం కాంప్లెక్స్ లో 4 వేల నుంచి 5 వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తారు, విష్ణు నివాసం కాంప్లెక్స్ లో 4 వేల నుంచి 5 వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నారు , టీటీడీ హాస్పిటల్స్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 6 వేల మంది వరకు అన్న ప్రసాదం అందిస్తున్నారు మరియు II NC & III NC అన్నప్రసాదం కౌంటర్ లో 2 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. 

తిరుచానూరు లో టీటీడీ వారి S.V అన్నప్రసాదం కౌంటర్ లో 3,500 నుంచి 5,000 మంది భక్తులు వరకు అన్నప్రసాదం అందుతోంది.

ఈ అన్నప్రసాదం సేవ కు  డొనేషన్ చేసే అవకాశం టీటీడీ వారు భక్తులకు ఇస్తున్నారు. ఈ అన్న ప్రసాదానికి భక్తులు తమకు నచ్చినంత స్పాన్సర్ చేయచ్చు. ఆహార సమయం బట్టి డొనేషన్ ఇచ్చే అమౌంట్ మారుతుంది. బ్రేక్ ఫాస్ట్ అయితే సుమారు 8 లక్షల వరకు, భోజనం మరియు డిన్నర్ అయితే సుమారు 15 లక్షల వరకు డొనేషన్ ఇవ్వచ్చు.  అలా డొనేషన్ ఇచ్చిన వారి పేర్లను తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కౌంటర్ లో డిస్ప్లే అవుతాయి. 

ఈ అన్న ప్రసాదానికి డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే: 

A PHP Error was encountered

Severity: Notice

Message: fwrite(): Write of 34 bytes failed with errno=122 Disk quota exceeded

Filename: drivers/Session_files_driver.php

Line Number: 275

Backtrace:

A PHP Error was encountered

Severity: Warning

Message: session_write_close(): Failed to write session data using user defined save handler. (session.save_path: /var/cpanel/php/sessions/ea-php81)

Filename: Unknown

Line Number: 0

Backtrace: