Menu
Complete Details About TTD Kalyana Mandapam

టీటీడీ వారు నూతన వధువు వరులకు వివాహం సాంప్రదాయంగా, తక్కువ ఖర్చులో, దగ్గరలో జరిపించాలి అనే ఉద్దేశం తో చాలా ప్రాంతాలలో కళ్యాణమండపాలను కట్టించారు. వాటికి టీటీడీ కళ్యాణ మండపం అని పేరు పెట్టారు. కార్పొరేషన్లు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు , మండలాలు, మున్సిపాలిటీలు , ద్వారకా తిరుమల లో మరియు ఇతర చోట్ల ఈ టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఈ కళ్యాణ మండపాలలో ఇప్పటికే చాలా కళ్యాణాలు జరిగాయి. అయితే ఈ కళ్యాణ మండపంలో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. 

ఇలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకుని టీటీడీ కళ్యాణ మండపం లో వివాహం జరిపించాలి. ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపం లో రిజిస్టర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 

టీటీడీ కళ్యాణ మండపం బుకింగ్ ప్రక్రియ TTD Kalyana Mandapam Booking Procedure

  1. ముందుగా టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అయి  అందులో ఉన్న కళ్యాణమండపం ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి 
  2. తర్వాత మీరు మీ రాష్ట్రం, జిల్లా, ప్రాంతం ఎంచుకుని కళ్యాణమండపాన్ని ఎంచుకోండి. 
  3. ఆ పేజీలో కనిపించే క్యాలెండర్ లో డేట్ గ్రీన్ కలర్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. గ్రీన్ కలర్ లో ఉన్న డేట్స్ లో మీకు నచ్చిన ఒక డేట్ ను ఎంచుకోండి. 
  4. తర్వాత మీకు కళ్యాణమండపం ఎన్ని రోజులకి కావాలో ఎప్పటి నుంచి ఎప్పటికి కావాలో ఎంచుకోండి. మీరు కళ్యాణ మండపం రెండు రోజుల వరకు బుక్ చేసుకోవచ్చు. 
  5. మీకు కావాల్సిన తేదీ సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ప్రైస్ ఎస్టిమేట్ కనిపిస్తుంది. 
  6. అలాగే మీరు కల్యాణమండపం ఎందుకు బుక్ చేసుకుంటున్నారో ఆ సందర్భాన్ని(ఉపనయనం, వివాహం, ఎంగేజ్మెంట్, బారసాల, షష్టిపూర్తి , అన్నప్రాసన, రిసెప్షన్,  సత్యనారాయణ స్వామి వ్రతం) సెలెక్ట్ చేయండి. 
  7. తర్వాత మీరు మండపాన్ని మీకోసం బుక్ చేస్తున్నారో లేక వేరే వారి కోసం బుక్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. 
  8. సెక్యూరిటీ  డిపాజిట్ కింద కొంత అమౌంట్ మీరు కల్యాణ మండపం ఆలోకేట్ చేసుకునే సమయం లో ఇవ్వాల్సి ఉంటుంది.  ఆ అమౌంట్ మీరు మండపం కాళీ చేసే సమయంలో వెనక్కి ఇస్తారు. 
  9. అన్ని వివరాలు ఇచ్చాక కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి
  10. తర్వాత వరుడు మరియు వధువు యొక్క పూర్తి వివరాలు ఇవ్వండి 
  11. Continue ని సెలెక్ట్ చేస్తే పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. పేమెంట్ ను కంప్లీట్ చేయండి.